Wednesday, January 22, 2025

గూగుల్‌లో 10 శాతం మంది మేనేజిరియల్ హోదా ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

టెక్ సంస్థలోల కోతలు మళ్లీ మొదలయ్యాయి. ఉద్యోగులను ఎడా పెడా ఇంటికి పంపుతున్నాయి. నిరుడు 12 వేల మందికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపిన సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు మరి పది శాతం మందిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. రెండు సంవత్సరాలుగా చేపడుతున్న పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలియజేశారు. మేనేజిరియల్ హోదాల్లో ఉన్నవారిపై ఈ ప్రభావం పడనున్నది. కృత్రిమ మేధ (ఎఐ) సంస్థల నుంచి పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సంస్థ కార్యకలాపాల సామర్థాన్ని మెరుగుపరచుకోవలసిన అవసరం ఏర్పడిందని , ఫలితంగా ఉద్యోగులపై వేటు తప్పడం లేదని గూగుల్ తెలిపింది. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో 333 టెక్ సంస్థలు 98 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఒక్క మే నెలలోనే 39 సంస్థలు పది వేల మందిని ఇంటికి పంపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News