Sunday, December 22, 2024

అన్మోల్‌ప్రీత్ విధ్వంసక శతకం

- Advertisement -
- Advertisement -

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ నయా చరిత్ర సృష్టించాడు. శనివారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్మోల్‌ప్రీత్ 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు యూసుఫ్ పఠాన్ పేరిట ఉండేది. బరోడాకు ప్రాతినిథ్యం వహించిన యూసుఫ్ మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో శతకం సాధించాడు. ఈ రికార్డును తాజాగా అన్మోల్ బద్దలు కొట్టాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అన్మోల్ 45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. దీంతో 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 35 (నాటౌట్ తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. అశ్వని కుమార్, మయాంక్ మార్కండే మూడేసి వికెట్లను పడగొట్టారు.

కర్ణాటక రికార్డు విజయం
ముంబైతో జరిగిన మరో మ్యాచ్‌లో కర్ణాటక సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసక శతకం సాధించాడు. చెలరేగి ఆడిన అయ్యర్ 55 బంతుల్లోనే 10 సిక్సర్లు, 5 ఫోర్లతో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ ఆయూష్ (78), వికెట్ కీపర్ హార్దిక్ (84), శివమ్ దూబె 63 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 46.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. వికెట్ కీపర్ కృష్ణన్ 150 (నాటౌట్), అనీష్ (82), ప్రవీణ్ 65 (నాటౌట్) జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News