- Advertisement -
మేము హీరో అల్లుఅర్జున్ కు వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. ఈ ఘటనలో చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆదివారం కరీంనగర్ లోని భరోసా సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ జితేందర్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. థియేటర్ లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయన సినీ హీరో కావొచ్చు.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.
“సినిమా హీరోలైనా.. బయట పౌరులే.. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవు.. మాకు ప్రజల భద్రతే ముఖ్యం అని చెప్పారు. పోలీసులు వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదని.. ప్రజల భద్రత కంటే.. మూవీ ప్రమోషన్స్ ముఖ్యం కాదు” పేర్కొన్నారు.
- Advertisement -