Monday, December 23, 2024

శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించట్లేదు.. సినిమా వాళ్లకు మానవత్వం లేదా:వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వివాదం మళ్లీ ముదురుతోంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. అల్లుఅర్జున్, సినీ ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అల్లుఅర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ముగిసిందనుకున్న వివాదం మళ్ళీ రాజుకుంది.

అయితే, అల్లు అర్జున్ వ్యాఖ్యలు సిఎం రేవంత్ రెడ్డిని అగౌరపర్చే విధంగా ఉన్నాయని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సినీ ఇండస్ట్రీ వాళ్లు.. గాయపడిన బాలుడిని ఎందుకు పరామర్శించడంలేదని మండిపడ్డారు. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించట్లేదని.. సినిమా వాళ్ళు మొత్తం ఇలాగే మానవత్వం లేకుండా ఉంటారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News