- Advertisement -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని నటుడు అల్లు అర్జున్ ఇంటిపై ఒయు జెఎసి దాడి చేసింది. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమని దాడికి పాల్పడ్డారు. గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. పూలకుండీలు ధ్వంసం చేయడంతో పాటు ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి అల్లు అర్జున్ కుటుంబసభ్యులెవరూ బయటకు రాలేదు. జెఎసి నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
- Advertisement -