Tuesday, April 1, 2025

సిఎం చంద్రబాబు మనవడు ప్రపంచ రికార్డు : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎపి సిఎం నారా చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో నారా దేవాన్ష్ (9) “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్‌” ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన వరల్ బుక్ ఆఫ్ రికారడ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు.

దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు నారా దేవాన్ష్ ఇటీవల మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పారు. సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అలాగే తొమ్మిది చెస్ బోర్డులను ను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి నారా దేవాన్ష్ రికార్డు సాధించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News