- Advertisement -
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. గ్రామడో గ్రామంలో విమానం పలు ఇళ్లను ఢీకొట్టిన అనంతరం కూలిపోవడంతో పది మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. విమానం తొలుత ఓ భవనంలో దూసుకెళ్లిన అనంతరం ఇళ్లను ఢీకొడుతూ చివరగా ఫర్నీచర్ దూకాణంలో ఆగింది. విమానంలో ప్రయాణికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇళ్లలో ఉన్న 15 మంది గాయపడ్డారు. గ్రామడో గ్రామం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
- Advertisement -