అండర్-19 మహిళల ఆసియా కప్
కౌలాలంపూర్: అండర్-19 మహిళల ఆసియా కప్‌లో భారత్ అమ్మాయిలు ఛాంపియన్‌గా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తెలంగాణ అమ్మాయి త్రిష మినహా ఎవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎర్కొన్న త్రిష ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. మిథిలా వినోద్ 17, శుక్లా 10, కెప్టెన్ నికీ ప్రసాద్ 12 మాత్రమే రెండంకెల పరుగులు చేశారు. అనంరతం లక్ష ఛేదనకు దిగిన బంగ్లా అమ్మాయిలు 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలిపోయింది.
బంగ్లా మొదటి నుంచి తడబడింది. మొసమ్మత్ ఎవా, సుమైయా అక్తర్ సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. ఓపెనర్ ఫహోమిదా చోయా 18, జుయారియా ఫెర్దౌస్ 22 పరుగులు చేశారు. ఇవా డకౌట్ కాగా.. సుమైయా అక్తర్ సుబోర్నా 8, కెప్టెన్ సుమైయా అక్తర్ 4, సైదా అక్తర్ 5, జన్నతుల 3, హబిబా 1, ఫర్జానా 5, నిషిత అక్తర్ నిషి 1 పరుగు చేసింది.