Monday, December 23, 2024

‘గేమ్ చేంజర్’తో రామ్‌చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో.. గ్లోబ్ల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ అలా. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్‌తో పనిచేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. దిల్ రాజుతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. సెన్సేషన్ల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. వన్ నేనొక్కడినే మూవీని ఇక్కడి ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే నాకు నెక్ట్స్ సినిమాలు వచ్చేవి కావు. దిల్ రాజు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. శంకర్ చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను.

చిరంజీవి ఎందుకు శంకర్‌తో సినిమా చేయలేదు.. శంకర్ ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునేవాళ్లం. కానీ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా అని తెలియడంతో తెగ ఆనంద పడ్డాను. చిరంజీవితో కలిసే ఈ గేమ్‌చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్.. జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. రంగస్థలం తరువాత రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇక గేమ్ చేంజర్ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది’ అని తెలిపారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మా బ్యానర్‌లో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యం అయింది.

డోప్ సాంగ్‌ను ముందుగా నేను ఫోన్‌లో చూశా. ఈ పాటను డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి నాకు సంతోషం వేసింది. ఈ పాటను చూసినప్పుడు నాకు కంట్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను చిరంజీవి చిత్రాలను ఆడియెన్‌గా చూసి ఎంజాయ్ చేశా. కానీ తొలిప్రేమ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంజాయ్ చేశాను. కళ్యాణ్‌తో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టింది. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో ఎవడు చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు గేమ్ చేంజర్‌తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం. శంకర్ పాటలు, ఫైట్లు సెల్ ఫోన్‌లలో చూస్తే ఫీలింగ్ రాదు. వాటిని బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి. ప్రతీ సాంగ్‌ను శంకర్ అద్భుతంగా డిజైన్ చేసుకుంటారు. రా మచ్చా పాటను వైజాగ్, అమృత్ సర్‌లో 300 మందితో షూట్ చేశారు. నానా హైరానా పాటకోసం ప్రయోగాలు చేశారు. ఆ పాటను న్యూజిలాండ్‌లో షూట్ చేశారు.

జరగండి పాట లీక్ అయింది. అందుకే హడావిడిగా రిలీజ్ చేశాం. కానీ శంకర్ సంతృప్తి చెందలేదు. ఆ పాట ఏంటో మీకు థియేటర్లో తెలుస్తుంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు.ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ పెద్ద హిట్ కాబోతోంది‘అని పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ మాట్లాడుతూ ‘పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ నేను ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవి తో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు.

ఆ తరువాత మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాను. ఆపై ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ, వార్ మీదే ఈ చిత్రం ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతంగా నటించారు.. కాలేజ్ లుక్‌లో చాలా ఫైర్ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్నగా అద్భుతంగా నటించారు. సాంగ్స్‌లో అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్, అద్భుతమైన డ్యాన్స్‌లతో రామ్ చరణ్ మైమరపించారు‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్ట్ ఎస్.ఎస్.తమన్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లె, డైరెక్ట్ బుచ్చిబాబు సానా, నిర్మాత అనిల్ సుంకర, వర్స్టైల్ యాక్ట్ ఎస్.జె.సూర్య, హీరోయిన్ అంజలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News