హైదరాబాద్: పారిపోయిన ప్రేమజంటను ఇంటికి రప్పించి అనంతరం యువకుడిని గుర్తు తెలియని యువకులు కత్తులతో పొడిచ చంపారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓల్డ్ బోయిన్‌పల్లి లోపి ఆలీ కాంప్లెక్స్‌లో మహమ్మద్ సమీర్(25) వెల్డింగ్ పనులు జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం నాచారంలోని ఓ భవనానికి వెల్లిండ్ పనుగులు చేయడానికి వెళ్లాడు. భవనం యజమాని కూతురుతో సమీర్ ప్రేమలో పడ్డాడు. గతంలో ఇద్దరు కలిసి అస్సాంకు పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇద్దరికి ప్రేమ పెళ్లి చేస్తామని యువతి కుటుంబ సభ్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు వచ్చారు. అమ్మాయిని తీసుకెళ్లి మరో వ్యక్తితో నిశ్చితార్థం చేయడంతో సమీర్ అడ్డుపడినట్లు సమాచారం. డిసెంబర్ 21న అర్థరాత్రి సమీర్ ఇంటి బయట కూర్చున్నాడు. కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి కత్తులతో సమీర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించిడంతో వారిపై కూడా దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులు పరారీలో ఉండడంతో వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.