హైదరాబాద్: సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ తెలిపారు. అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై సిఎంతో చర్చిస్తామని నాగవంశీ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కు సినీ ఇండస్ట్రీ వెళ్ళిపోతుందా? అని జర్నలిస్టులు ప్రశ్నించారు.
హైదరాబాద్ లో చాలా డబ్బులు పెట్టి ఇల్లు నిర్మించుకన్నానని, తాను ఎపికి ఏలా వెళ్తానని నాగవంశీ ఎదురు ప్రశ్నించారు. సినీ పరిశ్రమ ఎక్కడికి వెళ్లదని, షూటింగ్స్, ఈవెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటాయని వివరణ ఇచ్చారు. ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు సినీ ఇండస్ట్రీ రావాలని పిలుపునిచ్చి నేపథ్యంలో నాగవంశీ తెలిపారు. ఎపి సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని పవన్ కల్యాన్ చెప్పారన్నారు. ఎపి, తెలంగాణ విషయంలో సమ ప్రాధాన్యత ఉందన్నారు.