Monday, December 23, 2024

ఈ గాడ్జెట్‌లు చలి నుంచి కాపాడుతాయి..

- Advertisement -
- Advertisement -

చలికాలం రాగానే చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము. అందరూ స్వెటర్లను వేసుకుంటే మరికొందరు అగ్ని మంటను కాపుకుంటారు. అయితే చలికాలంలో ఎక్కడికైనా భేటీ వెళ్లాల్సి వస్తే.. చలి గురించి ఎంతో భయపడాల్సి వస్తుంది. ఈరోజుల్లో చలి నుండి మనల్ని రక్షించే కొనే అద్భుతమైన గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. అటువంటి మూడు ముఖ్యమైన వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాగ్నెటిక్ హ్యాండ్ వామర్స్

ఉదయం పూట లేకుంటే రాత్రిపూట బయటికి వెళ్లాల్సి వస్తే.. చేతులను వెచ్చగా ఉంచడానికి మాగ్నెటిక్ హ్యాండ్ వామర్స్ ను కొనుగోలు చేయవచ్చు. వాటి ధర దాదాపు రూ. 3000 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. వీటిని సులభంగా జేబులో పెట్టుకొని ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఈ హ్యాండ్ వామార్లు చేతులను వెచ్చగా ఉంచడమే కాకుండా పవర్ బ్యాంకు లాగా పని చేస్తాయి.

మల్టీ పర్పస్ ఇంటర్ క్యాప్స్

చాలామంది చలికాలంలో రెగ్యులర్ క్యాప్స్ వాడుతారు. వీటి లాగానే తక్కువ ధరకు, తల, చెవులు వెచ్చగా ఉండేలా మల్టీ పర్పస్ వింటర్ క్యాప్స్ మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ క్యాప్స్ లో మ్యూజిక్ సిస్టం ఉంటుంది. దీంతో మనం పాటలు ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయి. ఇవి చలిని నుంచి రక్షించడమే కాకుండా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాయి.

మినీ పోర్టబుల్ కెటిల్

శీతాకాలంలో ఎక్కడైనా వేడి నీరు లేదా టీ కావాలంటే తగలనుకుంటే మినీ పోర్టబుల్ కెటిల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది తక్కువ బరువు ఉంటుంది. ఎక్కడికైనా సులభంగా తెసుకేల్లోచ్చు. వింటర్ సీజన్‌లో ఇది తప్పనిసరిగా వాడాల్సిన గాడ్జెట్. ఈ మూడు గాడ్జెట్‌లు శీతాకాలంలో ఎంతో సహాయపడుతాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News