ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ బజాజ్ ఆటో తన పాపులర్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త శ్రేణిని మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్ కంపెనీ బజాజ్ చేతక్ 35 సిరీస్‌పేరిట విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో అప్‌గ్రేడ్ ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు అనేక గొప్ప ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మునపటి మోడల్ కంటే ఎక్కువ రేంజ్ తో వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
ఫీచర్స్
ఈ స్కూటర్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ కంట్రోల్, మ్యూజిక్ మేనేజ్‌మెంట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దీనితో పాటు.. ఈ స్కూటర్ లో కాల్ అటెండింగ్, మ్యూజిక్ కంట్రోల్, రియల్ టైమ్ నోటిఫికేషన్‌లు నేరుగా డిస్‌ప్లేలో కనిపిస్తాయి.
స్టోరేజ్, బ్యాటరీ
చేతక్ 35 సిరీస్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురాబడింది. ఈ స్కూటర్లో 3.5 kWh అండర్‌ఫ్లోర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మునుపటి కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో కింది బాగాన ఎక్కువ సీటు నిల్వను కలిగి ఉంది. దీనిలో హెల్మెట్, ఇతర ముఖ్యమైన వస్తువులను పెట్టవచ్చు. అంతేకాకుండా ఛార్జింగ్ కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్ అందించారు.
రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ దాదాపు 125 కిమీ రేంజ్ ఇస్తుంది. ఒకవేళ పూర్తిగా ఛార్జ్ చేస్తే 153 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. 950-వాట్ ఛార్జర్ సహాయంతో ఈ స్కూటర్ కు 3 గంటల 25 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది. కొత్త చేతక్ 35 సిరీస్ గరిష్ట వేగం గంటకు 73 కిమీ అని కంపెనీ పేర్కొంది. కాగా, ఇందులో ఎకో, స్పోర్ట్స్ మోడ్ రెండూ ఉన్నాయి.
ధర
కొత్త బజాజ్ చేతక్ చేతక్ 3502, చేతక్ 3501 అనే రెండు వేరియంట్లలో కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. కాగా, చేతక్ 3502 ధర రూ. 1.2 లక్షలుగా, చేతక్ 3501 ధర రూ. 1.27 లక్షలుగా కంపెనీ పేర్కొంది.