శ్రీ నారసింహ చిత్రాలయ బ్యాన్ప నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు‘ మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియర్ నటుడు బాబు మోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్. కెమెరా స్విఛాన్ చేశారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షలు దామోదర ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, టీ ఎం ఏ ఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ.. ‘బ్యానర్, టైటిల్, డైరెక్టర్.. ఇలా ఈ సినిమాకు అన్నీ పవర్ ఫుల్‌గానే ఉన్నాయి. బ్యానర్ నారసింహుడి పవర్ఫుల్ రూపాన్ని చూపించడం సినిమాపై పాజిటివ్ పెంచుతుంది. ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు” చాలా మంచి టైటిల్. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. ‘అని అన్నారు. దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ..
‘ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఒక మంచి సబ్జెక్టుతో చేస్తున్న చిత్రమిది. ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు‘ టైటిల్కు మంచి స్పందన వస్తోంది’ అని తెలిపారు. సహ నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. ‘మర్రి చెట్టు తెలియని వారు ఉండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి మర్రిచెట్టుతో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి మర్రి చెట్టు కాన్సెఫ్టుతో రానున్న ఈ సినిమా అందరిని అలరించడం ఖాయం’ అని పేర్కొన్నారు. హీరోలు ప్రమోద్ దేవా, రణధీర్ మాట్లాడుతూ.. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు.