Friday, January 24, 2025

హోటల్‌లో ప్రియురాలు మృతదేహం… రైలు కిందపడి ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లవర్ మృతదేహం హోటల్ రూమ్‌లో కనిపించగా ప్రియుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలోని పాశ్చిమ్ విహార్ ప్రాంతం, గురుగ్రామ్‌లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డిసెంబర్ 14న ఓ యువతి కనిపించడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆమె తల్లిదండ్రులు వెతికారు. ఆమె ఎక్కడా కనిపించపోవడంతో తల్లిదండ్రులు డిసెంబర్ 16న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

డిసెంబర్ 17న ఢిల్లీలోని పాశ్చిమ విహార్ ప్రాంతంలో యువతి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి ప్రియుడు సురేందర్ డిసెంబర్ 18 గురుగ్రామ్‌లోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతోనే ప్రియుడు కూడా సూసైడ్ చేసుకొని ఉండొచ్చిన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఎక్కడా లభించలేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News