Tuesday, December 24, 2024

పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యుపిఎస్‌సిని వంచించి, సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఒబిసి, అంగవైకల్య కోటా ప్రయోజనాలను అక్రమంగా పొందారనే ఆరోపణతో ఐఎఎస్ మాజీ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్‌పై దాఖలైన క్రిమినల్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. ఖేడ్కర్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి చంద్ర ధారి సింగ్ తీర్పు వెలువరిస్తూ.. ‘ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించడమైంది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను తొలగించడమైంది’ అని తెలిపారు. ఖేడ్కర్‌కు వ్యతిరేకంగా ప్రాథమికంగా బలమైన కేసు ఉన్నదని, కుట్ర బహిర్గతానికి దర్యాప్తు అవసరమని జస్టిస్ సింగ్ తెలియజేశారు.

రాజ్యాంగ సంస్థపైన, సమాజంపైన పాల్పడిన వంచన కేసు అది అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022 కోసం తన దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారని ఖేడ్కర్‌పై ఆరోపణ వచ్చింది. ఢిల్లీ పోలీసు, ఫిర్యాదీ, యుపిఎస్‌సి తరఫు న్యాయవాడులు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. యుపిఎస్‌సికి సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్, న్యాయవాది వర్ధమాన్ కౌశిక్ ప్రాతినిధ్యం వహించారు. తనపై ఆరోపణలు అన్నిటినీ ఖేడ్కర్ ఖండించారు. తప్పుడు గుర్తింపుతో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైనందుకు ఆమెపై ఒక క్రిమినల్ కేసు దాఖలుతో సహా పలు చర్యలను యుపిఎస్‌సి తీసుకున్నది. కాగా, ఐసిసి, ఐటి చట్టం, దివ్యాంగుల హక్కు చట్టం నిబంధనల కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News