Tuesday, December 24, 2024

ఎగ్జామ్ ఫారాలపై 18 శాతం జిఎస్‌టి భారమా?.. ప్రియాంక ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదు కానీ ఎగ్జామ్ ఫారాలపైన, ఉద్యోగాల దరఖాస్తు పత్రాలపైన మాత్రం 18 శాతం జిఎస్‌టి భారం మోపుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. పైసాపైసా కూడబెట్టి తమ పిల్లలను పరీక్షలకు సిద్ధం చేసే తల్లిదండ్రుల కలలను ఈ విధంగా ఆదాయ వనరుగా మార్చుకుంటోందని విమర్శించారు. సుల్తాన్‌పూర్ లోని కల్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫారంపై 18 శాతం జిఎస్‌టి విధించిందని ప్రియాంక ఉదహరించారు. ఇది ‘నిలువుదోపిడి’ అని ఆరోపించారు.

“బీజేపీ యువతకు ఉద్యోగాలు కల్పించలేదు. ఎగ్జామ్ ఫారాలపై మాత్రం జిఎస్‌టి 18 శాతం వసూలు చేస్తూ గాయాలపై మరింత కారం చల్లుతోంది. ఆ ఫారం దాఖలు చేసిన తరువాత ఎగ్జామ్ పేపర్ ప్రభుత్వ వైఫల్యం వల్ల లేదా అవినీతి వల్ల లీకైతే, అభ్యర్థుల సొమ్ము అంతా వృధాయే” అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News