Wednesday, December 25, 2024

ఆస్ట్రేలియా సిరీస్‌కు షమి దూరం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతన్ని ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయడం లేదు. ఈ విషయాన్ని బిసిసిఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమి జట్టుకు దూరమయ్యాడు.

చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమి ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో బెంగాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో షమిని ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన మ్యాచ్‌లకు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో లేడని బిసిసిఐ మెడికల్ టీమ్ పరీక్షల్లో తేలింది దీంతో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు షమిని ఎంపిక చేయడం లేదని బిసిసిఐ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News