- Advertisement -
హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు చిక్కడపల్లి పోలీసులు బన్నీని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన 50కి పైగా ప్రశ్నలు సంధించారు. అల్లుఅర్జున్ ను చిక్కడపల్లి ఏసీపి, డిసిబి, సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందంతో కలిసి విచారించారు. ఈ ఘటనపై ఆయన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. మరికాసేపట్లో బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తన నివాసానికి వెళ్లనున్నారు. కాగా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఎస్ నుంచి 200 మీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు.
- Advertisement -