Wednesday, December 25, 2024

అత్యాధునిక సాంకేతికతను ఆవిష్కరించిన టాటా మోటార్స్

- Advertisement -
- Advertisement -

న్యూదిల్లీ: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టాటా మోటార్స్ బౌమా కాన్ ఎక్స్‌పో 2024లో అధునాతన అగ్రిగేట్స్ సమగ్ర శ్రేణిని ప్రదర్శించింది. 125kkVA శ్రేణి నుండి 25kkVA పవర్ శ్రేణి వరకు లభ్యమయ్యే CPCB IV+ కాంప్లియంట్ టాటా మోటార్స్ జెనెసెట్స్, CEV BS V ఎమిషన్ – కాంప్లియెంట్ 55-138hp పవర్ నోడ్స్ ఇండస్ట్రియల్ ఇంజిన్లు, లైవ్ యాక్సిల్స్, ట్రైలర్ యాక్సిల్స్, కాంపోనెంట్స్ ఇక్కడ ప్రదర్శించబడిన వాటిలో ఉన్నాయి. మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ పరికరాలు, పారిశ్రామిక వినియోగాలు, లాజిస్టిక్స్ విభాగాల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి ఈ ఉత్పాదనలు రూపొందించబడ్డాయి. అధిక సామర్థ్యం, మన్నికకు వీలుగా తీర్చిదిద్దబడ్డాయి.

బౌమ కాన్ఎక్స్‌పో 2024లో టాటా మోటార్స్ అగ్రిగేట్స్
టాటా మోటార్స్ జెన్‌సెట్స్: CPCB IV+ రిమోట్ మానిటరింగ్ సిస్టమ్‌కు అనుగుణంగా; 25kVA నుండి 125kVA పవర్ రేంజ్
ఇండస్ట్రియల్ ఇంజన్లు: CEV BS V ఎమిషన్స్- కాంప్లియంట్; 55-138hp పవర్ నోడ్స్‌లో లభిస్తుంది.
లైవ్ యాక్సిల్స్: అధిక టన్నుల నిర్మాణ సామగ్రి కోసం పటిష్టంగా రూపొందించబడింది
ట్రైలర్ యాక్సిల్స్, భాగాలు: హెవీ-డ్యూటీ వాణిజ్య వాహనాల కోసం కొత్త 16mm మందపాటి ట్రైలర్ యాక్సిల్ బీమ్

బౌమ కాన్ఎక్స్‌పో 2024లో టాటా మోటార్స్ పెవిలియన్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, స్పేర్స్ అండ్ నాన్-వెహిక్యులర్ బిజినెస్ హెడ్ విక్రమ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘టాటా మోటార్స్ అగ్రిగేట్‌లను కోరుకునే కస్టమర్‌ల కోసం విశ్వసనీయమైన టాటా మోటార్స్ అగ్రిగేట్‌లను పరి చయం చేయడానికి బౌమా కాన్‌ఎక్స్‌పో సరైన వేదిక. ఈ కొత్త అగ్రిగేట్స్ మా కస్టమర్ల ప్రత్యక్ష స్వరం. విస్తృతమైన కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. భారతదేశ అభి వృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి మేం మా పోర్ట్‌ ఫోలియోను విస్తరిస్తున్నాం – జెన్‌సెట్‌లతో పవర్ సొల్యూ షన్‌ లను అందించడం, CEV BS V ఎమిషన్-కాంప్లియంట్ ఇండస్ట్రి యల్ ఇంజన్లు, లైవ్ యాక్సిల్స్‌తో మౌలిక వసతుల రంగా నికి అందించడం, ట్రయలర్ యాక్సెల్స్, కాంపోనెంట్స్ తో లాజిస్టిక్‌లను బలోపేతం చేయడం చేస్తున్నాం’’ అని అన్నారు.

టాటా మోటార్స్ అగ్రిగేట్స్ వాటి అధిక మన్నిక, సామర్థ్యం, పనితీరుతో విభిన్నంగా ఉంటాయి. విస్తృతమైన పరిశోధ నల ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. అత్యాధునిక కేంద్రాలలో తయారయ్యాయి. ఈ ఉత్పాదనలకు దేశ వ్యాప్తంగా 2500కి పైగా అధీకృత సర్వీస్ అవుట్‌లెట్‌లచే మద్దతు లభిస్తుంది. కఠినమైన పారిశ్రామిక నిర్దేశాలకు అనుగుణంగా వినూత్నమైన, అధిక-పనితీరు గల అగ్రిగేట్స్‌ను అందించడం ద్వారా భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధికి మద్దతు ఇవ్వడానికి కంపెనీ కట్టుబడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News