Wednesday, December 25, 2024

సంధ్య థియేటర్ ఘటన.. అల్లుఅర్జున్ బౌన్సర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందుతుడు ఆంటోనిని అరెస్టు చేశారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా అల్లుఅర్జున్ బౌన్సర్ ఆంటోనిగా పోలీసులు గుర్తించారు. బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా ఆంటోని పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా ఆంటోని పనిచేస్తాడని సమాచారం. ఈ ఘటనలో సీన్ రీకంస్ట్రక్షన్ కోసం ఆంటోనిని పోలీసులు సంధ్య థియేటర్ కు తీసుకెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, పోలీసులు..అల్లుఅర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు మూడున్నర గంటలకు విచారించారు. ఈ సందర్భంగా బన్నీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయన తన నివాసాని వెళ్లిపోయాడు అల్లుఅర్జున్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News