Wednesday, December 25, 2024

షేఖ్ హసీనాపై అవినీతి దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో రూప్‌పూర్ అణు విద్యుత్ కేంద్రంలో 5 బిలియన్ డాలర్ల మేరకు దుర్వినియోగం చేశారనే ఆరోపణల సందర్భంగా మాజీ ప్రధాని షేఖ్ హసీనాపై అవినీతి నిరోధక బృందం దర్యాప్తు ప్రారంభించినట్లు మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో రూప్‌పూర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భారతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రష్యన్ ప్రభుత్వ రంగ సంస్థ రొసతోమ్ ఆ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. రష్యన్ రూపకల్పన చేసిన తొలి బంగ్లాదేశీ అణు విద్యుత్ కేంద్రాన్ని రాజధాని ఢాకాకు పశ్చిమంగా 160 కిమీ దూరంలోని రూప్‌పూర్‌లో నిర్మిస్తున్నారు. రూప్‌పూర్ ఎన్‌పిపి ప్రాజెక్ట్ గురించి మీడియాలో వచ్చిన ‘రెచ్చగొట్టే ప్రకటనలను’ రొసతోమ్ తోసిపుచ్చింది. హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్‌ను, ఆమె బంధువు, యుకె ఆర్థిక శాఖ మంత్రి తులిప్ సిద్దిఖ్‌ను కూడా ప్రశ్నిస్తున్నట్లు బిడిన్యూస్ వెల్లడించింది.

రూప్‌పూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్‌లో 5 బిలియన్ డాలర్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని బిడిన్యూస్ తెలియజేసింది. రూప్‌పూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ నుంచి 5 బిలియన్ డాలర్లను హసీనా, జాయ్, తులిప్ ఒక మలేషియన్ బ్యాంక్‌కు బదలీ చేయడంపై అవినీతి నిరోధక కమిషన్ (ఎసిసి) క్రియాశూన్యతను చట్టవిరుద్ధంగా ఎందుకు ప్రకటించరాదో అడుగుతూ హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఎసిసి పత్రాల ప్రకారం, రూప్‌పూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలను నేషనల్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు. భారీ స్థాయిలో విద్యార్థుల నిరసన ప్రదర్శనల వల్ల తన 16 ఏళ్ల ప్రభుత్వం కూలిపోయిన తరువాత ఆగస్టు 5న దేశం నుంచి పారిపోయినప్పటి నుంచి 77 ఏళ్ల హసీనా భారత్‌లో నివసిస్తున్నారు. ఆమె సోదరిర రెహానా ఆమె వెంట వెళ్లారు. జాయ్ యుఎస్‌లో నివసిస్తుండగా, తులిప్ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యురాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News