పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థిని హాస్టల్ లో ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్ నగర్ లో సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్ లో చోటు చేసుకుంది.కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి రేణుక నాయక్ (24) అశోక్ నగర్ లో సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్ లో ఉంటూ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతుంది. ఇవాళ సాయంత్రం రూమ్ లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడగా పక్క రూమ్ లో ఉన్న స్నేహితురాలు గమనించి సిబ్బందితో కలిసి కిందకు దించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రేణుక కు గత నెలలో ఎంగేజ్ మెంట్ అయింది.ఫిబ్రవరి 7న పెళ్లి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేణుక నాయక్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -