చలికాలం లో ఉదయం లేవాలంటే పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. బొంత లేదా దుప్పటి కప్పుకొని అలానే పడుకుంటాం. కానీ పొద్దున్నే ఆఫీసుకి తప్ప కుండా వెళ్ళాలి. ఇది గుర్తొచ్చిన వెంటనే నిద్ర నుంచి మేల్కోవాలనిపిస్తుంది కానీ కోసేపు మళ్ళీ నిద్ర పోవాలనిపిస్తుంది. ఈ బద్ధకమే చాలా సార్లు మన పనులకు ఆలస్యం అవుతుంది. దీంతో దినచర్య కూడా చెడిపోతుంది. ఈ క్రమంలో చలికాలంలో ఉదయాన్నే నిద్రలేవదానికి కొన్ని చిట్కాలు చూద్దాం.
చలికాలంలో ఉదయానే లేవాలంటే రాత్రి పడుకునే ముందు ఉదయం ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇది ప్రేరణను అందిస్తుంది. ఇందులో వ్యాయామం, ధ్యానం లేదా అధ్యయనాలు వంటి వాటిని చేర్చుకోవాలి. లక్ష్యాన్ని గుర్తుంచుకోవడం త్వరగా మేల్కొలపడానికి సహాయపడుతుంది.
పొద్దున్నే నిద్ర లేవాలనుకుంటే రాత్రి త్వరగా నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల తెల్లవారుజామున త్వరగా నిద్రలేస్తాము. ఇది సరైన దినచర్యను నిర్వహిస్తుంది. నిద్ర నుంచి త్వరగా లేవడానికి రాత్రి నిద్రపోయే ముందు అలారం సెట్ చేసుకోవాలి. అలారం పెట్టే ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టాలి. దీంతో ఉదయానే నిద్ర లేస్తాము.
ఉదయాన్నే నిద్రలేవడానికి శరీరం రిలాక్స్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, నిద్రపోయే ముందు ధ్యానం చేయాలి. లేదా ఏదైనా పుస్తకాన్ని చదవవచ్చు. ఇది మీకు బాగా నిద్రపోవడానికి, ఉదయాన్నే మేల్కొలపడానికి సహాయపడుతుంది. ఇంకో ముఖ్యమైన విష్యం ఏంటంటే రాత్రి నిద్రించడానికి గంట ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది ఉదయం లేవడానికి చాలా సహాయపడుతుంది. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ఉదయాన్నే బద్ధకాన్ని తరిమికొట్టవచ్చు.