Wednesday, December 25, 2024

నడి సముద్రంలో మునిగిన రష్యా నౌక

- Advertisement -
- Advertisement -

రష్యాకు చెందిన ఓ కార్గో నౌక మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఇంజిన్ రూమ్‌లో పేలుడు సంభవించడంతో ఈ సంఘటన జరిగింది. నౌకలో ఉన్న 16 మంది సిబ్బందిలో 14 మందిని రక్షించామని, ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఈ కార్గోషిప్ డిసెంబర్ 11న రష్యా లోని సెయింట్ పీటర్‌బర్గ్ నుంచి బయల్దేరింది. సోమవారం చివరిగా దాని నుంచి సిగ్నల్ అందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News