ఒకటి, రెండు రోజులలో సినీరంగ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలువబోతున్నామని రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రాణపాయస్థితిలో సికింద్రాబాద్‌లో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్యపరిస్దితిని వైద్యులను అడిగి దిల్‌రాజు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రభుత్వాన్ని, సినీ పరిశ్రమను సమన్వయం చేస్తానన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమ న్నారు. ఆమె కుటుంబానికి చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం అండగా ఉంటుందని దిల్‌రాజు హామీ ఇచ్చారు. మొదట అల్లు అర్జున్‌ను ఆ తర్వాత చిత్ర పరిశ్రమ పెద్దలను కలిసి చర్చించాక సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నట్టు తెలిపారు.కలుస్తానని ఆ తర్వాత సిఎంను కలిసి చిత్ర పరిశ్రమ అభిప్రాయం చెబుతానని తెలిపారు.
తాను విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఇప్పటిదాకా కలవలేకపోయినట్టు వివరించారు.ఈ దురదృష్టకర ఘటన ఉహించని పరిణామమన్నారు. మృతురాలు రేవతి కుటుంబం వినోదం కోసం సినిమాకు వెళితే ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందన్నారు. తమవంతుగా రేవతి భర్త భాస్కర్‌కు సినిమా పరిశ్రమలో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు పాటు ఆయన కూతరుకు కూడా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించడానికి కృషి చేస్తానని దిల్‌రాజు హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం మాత్రమే అన్నారు. చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారని తెలిపారు. త్వర లో సిఎంను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు. ఎలాంటి సమస్య రాకుండా చూసే బాధ్యత తనదేనన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని తెలిపారు. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమను మరింత పెద్దదిగా చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
నిజానికి 2014లోనే టాలీవుడ్ అభివృద్ధికి భూములు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా దశాబ్ద కాలంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ గతేడాది సిఎం రేవంత్ రాకతో ఆగిపో యిన నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ అవార్డుల ప్రదానో త్సవం ఉంటు ందని, కమిటీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా దిల్ రాజు ప్రకటించారు.