Wednesday, December 25, 2024

మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధం

- Advertisement -
- Advertisement -

సినీనటుడు మోహన్‌బాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్టు చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్‌బాబు ఓ మీడియా ఛానల్ రిపోర్టర్‌పై దాడి చేయడంతో పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడంతో మోహన్‌బాబు తనను అరెస్టు చేయవద్దని డిసెంబర్ 24వ తేదీ వరకు మినహాయింపు తీసుకున్నాడు. గడువు ముగుస్తుండడంతో మోహన్‌బాబు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మోహన్‌బాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ క్రమంలోనే 24వ తేదీ తర్వాత మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, నోటీసులకు స్పందించకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే విచారణకు వచ్చేందుకు సమయం కావాలని మోహన్ బాబు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కోర్టుకు తన వయస్సు 78 ఏళ్ల అని కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరాడు. విచారణలో భాగంగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News