వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్‌లో 2-0 సిరీస్‌ను సొంత చేసుకుంది. తొలుతబ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతిక రావల్ జట్టుకు శుభారంభం అందించారు. మంధాన 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 53 పరుగులు చేసింది. ప్రతిక రావల్ 10 ఫోర్లు, సిక్స్‌తో 76 పరుగులు సాధించింది.
ఇద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. మరోవైపు చెలరేగి ఆడిన హర్లిన్ డియోల్ అద్భుత సెంచరీ సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హెర్లిన్ 103 బంతుల్లోనే 16 ఫోర్లతో 115 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 36 బంతుల్లోనే 52 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ హీలీ మాథ్యూస్ (106) అద్భుత సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది.