మన తెలంగాణ/సిటీ బ్యూరో: అ నధికార నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమే..కూలగొట్టడం ఒక్కటే హైడ్రా పనికాదు. కాలనీ సంఘా లు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రా ధాన్యతనిస్తామని హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎవి రంగనాథ్ స్పష్టం చేశారు. బా లానగర్‌లోని నేషనర్ రిమోట్ సె న్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి)ను కమిషనర్ రంగనాథ్ మంగళవా రం సందర్శించారు. సెంటర్ అధికారులతో రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమై చెరువులు, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ల అంశంపై సమగ్రం గా చర్చించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల వివరాలను తెలుసుకునేట్టుగా ప్రజలకు సౌకర్యాన్ని కల్పించనున్నట్టు రంగనాథ్ తెలిపారు. ఎఫ్‌టిఎల్‌లో ని భవనాల్లో ప్రజలు నివసిస్తుంటే వాటిని కూల్చబోమనీ, ప్రజలు ని వసిస్తున్న ఏ భవనాలను హైడ్రా కూల్చదని, అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు తీసుకుంటుందని ఆ యన స్పష్టం చేశారు. హైడ్రా ఏ ర్పాటుకు ముందుగా మంజూరైన అనుమతులు చెల్లుతాయని, హై డ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చుతామన్నారు.
ఈపాటికే ఔ టర్ రింగ్ రోడ్ పరిధిలోని 12 చె రువులను పునరుద్ద్ధరిస్తున్నామని, పార్కుల కబ్జాలపై వేలాదిగా కాల నీ సంఘాల నుంచి ఫిర్యాదులు వ స్తున్నాయని, వాటితో ఎన్నో పార్కులను కబ్జాల నుంచి కాపాడామని తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతమే హైడ్రా పరిధిలోకి వస్తుందని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎస్‌ఆర్‌ఎస్‌సీల సహకారం కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు వెళతామని రంగనాథ్ తెలిపారు. చెరువుల ఎఫ్‌టిఎల్ నిర్ధారణతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఎన్‌ఆర్‌ఎస్‌సి శాటిలైట్ ఇమేజ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను గుర్తించడమే కాకుండా లోతట్టు ప్రాంతాలను వరద ముప్పు ఉన్న ప్రదేశాలను గుర్తించేందుకు కూడా ఈ ఇమేజ్‌లు ఉపయోగపడుతాయన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు నీట మునిగాయి, వరద కాలువల ఉధృతి, చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం వంటి విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఎన్‌ఆర్‌ఎస్‌పి ఇమేజ్‌లు అవసరమని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఎస్‌సీ సానుకూలం..
సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్‌ల నుంచి సమాచారాన్ని సేకరించిన హైడ్రాకు ఎన్‌ఆర్‌ఎసి వద్ద ఉన్న హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్‌లతో మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణల గుర్తింపులో ఈ శాటిలైన్ ఇమేజ్‌లు కచ్చితమైన సమాచారాన్ని తెలుపుతాయని ఆయన వెల్లడించారు. చెరువుల పరిరక్షణలో ఎన్‌ఆర్‌ఎస్‌సి కూడా భాగస్వామిగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. ఈ ప్రతిపాదనకు ఎన్‌ఆర్‌ఎస్‌సి డైరెక్టర్ సమ్మతించినట్టు వెల్లడించారు. 1973 నుంచి 2024 వరకు ఎక్కువ వర్షపాతం నమోదైన డేటా ఆధారంగా అప్పటి శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లను గుర్తించేందుకు హైడ్రా కృషి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
చెరువులపై సమీక్ష..
ఓఆర్‌ఆర్ పరిధిలో చెరువుల పరిరక్షణపై మంగళవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ రంగనాథ్ సమీక్షించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాలకు చెందిన హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు రేఎవెన్యూ అధికారులతో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులతో చెరువుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చించారు. చెరువుల పరిరక్షణపై నిర్థిష్టమైన విధానాలతో వెళ్ళాలని, ఎవరూ ప్రశ్నించడానికి తావులేకుండా ఎఫ్‌టిఎల్ నిర్ధారణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువులతో పాటు వాటిని అనుసంధానిస్తూ ఉండే కాలువలపైనా కమిషనర్ రంగనాథ్ చర్చించారు. వీటిని పునరుద్ద్ధరించి, కాలువలు ఏర్పాటుచేసి వాటికి పూర్వ వైభవం తీసుకురానున్నట్టు రంగనాథ్ వెల్లడించారు.