- Advertisement -
2040 నాటికి చంద్రుడి పైకి వ్యోమగాములను పంపాలని లక్షంగా పెట్టుకున్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతరిక్షరంగంపై వెచ్చిస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు రూ. 2.52 ఆదాయం పొందుతున్నట్టు వివరించారు. అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణల కోసం మోడీ ప్రభుత్వం రూ. 31 వేల కోట్లు కేటాయించిందని, రాబోయే 15 ఏళ్లలో ఇస్రో చేపట్టనున్న ప్రయోగాల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనే లక్షంతో ఉన్నామని, దీనికోసం 2028లో తొలి మాడ్యూల్‌ను నింగిలోకి పంపిస్తామని, 2035 నాటికి పూర్తి స్థాయిలో స్పేస్ స్టేషన్ అందుబాటు లోకి వస్తుందన్నారు.
- Advertisement -