Thursday, December 26, 2024

అజాత శత్రువు వాజ్‌పేయి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారతరత్న, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్ఫూ ర్తితో దేశ యువత ముందుకు సాగాల్సిన అవస రం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రా ష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చా రు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వా జ్‌పేయి అని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి (ఏబివి) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన శ త జయంతి ఉత్సవాల సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాస కార్యక్రమం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో మంగళవారం జరిగిం ది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపి సుధాన్ష్ త్రివేది, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపి ర ఘునందన్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ వి ద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నైతిక విలువల కు ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

వాజ్ పేయి హైదరాబాద్ వచ్చి వెళ్లే వరకు ఆయన బాగోగులు చూసుకునే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. వాజ్ పేయిని చాలా దగ్గర నుంచి చూ శానని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జి ల్లాలకు వాజ్ పేయి వచ్చారని, వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నానని కిషన్ రెడ్డి తెలిపారు. యువ మో ర్చా జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని వాజ్ పేయిని అనేకసార్లు కలిశానని పేర్కొన్నారు. వాజ్ పేయి ఉపన్యాసం ఎప్పుడూ కవితాత్మకంగా ఉండేదని వి వరించారు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రా ధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి అని పేర్కొంటూ వాజ్ పేయి ఒక్క ఓటుతో ప్రధాని పదవిని కోల్పోయారని గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి అజాత శత్రువుగా పేరుగాంచారని కొనియాడారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాలకు రో డ్డు కనెక్టివిటీ పెరిగిందని చెప్పారు. అనేక జాతీయ రహదారులకు వాజ్ పేయి రూపకల్పన చేశారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. వాజ్ పేయ్ స్ఫూర్తితో అమెరికా రోడ్లను తలదన్నేలా మోడీ అభివృద్ది చేశారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News