Thursday, December 26, 2024

రాజస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరౌలీ జిల్లాలోని కరౌలీ-గంగాపూర్‌ జాతీయ రహదారిపై సాలెంపూర్‌ వద్ద అతివేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గంగాపూర్ నుంచి కరౌలి వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు బుధవారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణంగా సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News