- Advertisement -
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని త్వరలో ‘ఫేక్ కేసులో’ అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజనతో సహా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి కొంతమంది వ్యక్తులు ఆందోళన చెందుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.
“మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన ద్వారా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వారికి అవి నచ్చట్లేదు. దీంతో త్వరలోనే ఓ ఫేక్ కేసులో అతిషిని అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నేతల ఇళ్లలపై దాడులు నిర్వహిస్తారు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
- Advertisement -