Thursday, December 26, 2024

ఈ మోటో ఫోన్ పై భారీ డిస్కౌంట్!

- Advertisement -
- Advertisement -

తక్కువ బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లు ఉండే ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.20000 మాత్రమే ఉందా? ఈ బడ్జెట్లో సరైన మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ మోటోరోలా తమ మోటరోలా ఎడ్జ్ 50 నియోను ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ధర రూ. 29999గా ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్ దానిపై 30% తగ్గింపును ఇస్తోంది. ఆ తర్వాత ఈ ఫోన్ కేవలం రూ. 20999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ పై దాదాపు రూ.19750 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తోంది. ఒకవేళ మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందినట్లయితే.. ఈ ఫోన్ ను కేవలం రూ. 1249 కే సొంతం చేసుకోవచ్చ. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే, 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. IDFC బ్యాంక్ కార్డ్‌పై రూ. 1000 తగ్గింపు అందుబాటులో ఉంది.

ఫీచర్లు

మోటరోలా ఈ ఫోన్‌ని ఆగస్ట్ 2024లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎడ్జ్ 50 నియో మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్‌లలో శక్తివంతమైన ఫోన్‌గా కనిపిస్తుంది. ఫోన్‌కు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇది వాటర్, దుమ్ము నుండి రక్షించడానికి IP68 రేటింగ్ పొందింది. ఇది 6.4-అంగుళాల LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది.

పనితీరు గురించి మాట్లాడినట్లయితే.. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12జిబి ర్యామ్, 512జిబి ర్యామ్ నిల్వతో జత చేయబడింది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP, దానితో పాటు 10MP, 13MP సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 32MP కెమెరా ఉంది.

చివరికి బ్యాటరీ విషయానికి వస్తే .. ఫోన్ 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనితో 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీరు రోజూ ఫోన్‌లో మల్టీ టాస్క్ చేసి గేమింగ్ చేస్తుంటే, ఎడ్జ్ 50 నియో మీకు సరైన ఫోన్ అని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News