Thursday, December 26, 2024

కజకిస్తాన్‌లో కూలిన విమానం: 30 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బాకు:  కజకిస్తాన్‌లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందగా 28 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కజక్ అధికారులు ప్రకటించారు. 72 మంది ప్రయాణికులతో బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో ఘటన జరిగినట్టు విమానయాన అధికారులు వెల్లడించారు. విమానానికి పక్షి ఢీకొనడంతో ఎమర్జెన్సీకు ల్యాండ్ కు ఎటిసి అనుమతి కోరినట్టు సమాచారం. సహాయక బృందాలు ఆరుగురిని కాపాడారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News