Thursday, December 26, 2024

చెన్నై వర్శిటీలో విద్యార్థినిపై లైంగిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

చెన్నైలో అన్నా విశ్వవిద్యాలయం ఆవరణలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక అత్యాచారం జరిగింది. ఆమె మిత్రునిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. సోమవారం (23) సాయంత్రం జరిగిన ఈ ఘటన మంగళవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత వెలుగులోకి వచ్చింది. పోలీస్ వర్గాల కథనం ప్రకారం, ఈ కేసు సందర్భంగా కొత్తూరుపురం నుంచి జ్ఞానశేఖరన్ (37) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విశ్వవిద్యాలయం వెలుపల ఫుట్‌పాత్‌పై బిర్యానీ విక్రయిస్తుండే జ్ఞానశేఖరన్ నేరాన్ని ఒప్పుకున్నాడు.

అతనికి ఇతర కేసుల్లో ప్రమేయం ఉన్నదా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఈ ఘటనను వీడియో తీసి, ఆ ఇద్దరినీ బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. మరొక నిందితుని పట్టివేతకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై దీనిపై స్పందిస్తూ, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. శాంతి భద్రతల ‘దుస్థితి’పై డిఎంకె ప్రభుత్వాన్ని ఆయన నిశితంగా విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, అఖిల భారత మహిళల సంక్షేమ సమాఖ్య సభ్యులు బుధవారం విశ్వవిద్యాలయం ఆవరణ వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News