- Advertisement -
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 46 కు చేరినట్టు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తూర్పు పక్తికా ప్రావిన్స్ లోని బార్మల్ జిల్లాలో నాలుగు గ్రామాలే లక్షంగా వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 46 మంది చనిపోగా, మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఈ దాడులను అనాగరిక చర్యగా తాలిబన్ రక్షణ శాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించింది. ఈ దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్టు సమాచారం.
- Advertisement -