Thursday, December 26, 2024

ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరపణలతో హుజూరాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. విచారణలో భాగంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎకు పోలీసులు బుధవారం నాడు నోటీసులు ఇచ్చారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కౌశిక్ రెడ్డి పోలీసులను దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందు కు బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసానికి చేరకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

బిఆర్‌ఎస్ నేతల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. చక్రధర్ అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో ఇటీవల మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. చక్రధర్ చేసిన ఫిర్యాదులో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఉద్దేశపూర్వకంగానే పోలీసులు, ప్రభుత్వం బిఆర్‌ఎస్ నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. తన ఫోన్ ట్యాప్ అయిందని, అందుకు బాధ్యుతలైన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటెలిజెన్స్ ఐజి, సిఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి ట్రాక్ చేస్తున్నారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రేవంత్, ఇంటెలిజెన్స్ ఐజీపై ఫిర్యాదు చేస్తా అన్నారు. చెప్పినట్లుగానే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లగా అప్పటికే ఎసిపి అక్కడి నుంచి వెళ్లిపోయనట్టు చెప్పారు.

తనను మళ్లీ రావాలని చెప్పి వెళ్లిపోవడం ఏంటని పోలీస్ సిబ్బందిపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు తీసుకోవాలని సీఐకి చెప్పారు. అయితే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకునేందుకు సిఐ నిరాకరించడంతో ఆయనతో, పోలీస్ సిబ్బందితో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వాగ్వాదానికి దిగారు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఫిర్యాదు చేస్తే మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదు చేశారు కానీ ఎంఎల్‌ఎ వచ్చి ఫిర్యాదు తీసుకోకపోవడం నిర్లక్ష్యమే అన్నారు. ప్రజా ప్రతినిధి ఇచ్చే ఫిర్యాదును పట్టించుకోరా? అని కౌశిక్ రెడ్డి గట్టిగానే నిలదీశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసులను దూషించారని కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని ఈ నెల 6న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News