Thursday, December 26, 2024

జానీ మాస్టర్ కేసులో మరో సంచలనం

- Advertisement -
- Advertisement -

జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక అధారాలు సేకరించారు. సేకరించిన ఆధారాలతో జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈవెంట్స్ పేరు తోటి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడులు చేసినట్టు కనుగొన్నారు.

ఎన్నో ఏళ్లుగా జానీ మాస్టర్ వద్ద నార్త్‌కు చెందిన ఓ యువతి అసిస్టెంట్‌గా పని చేస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో సాంగ్స్‌కు ఆమె అసిస్టెంట్ గా పని చేసింది. సినిమాల షూటింగ్ నిమిత్తం ముంబై, బెంగుళూరు, చెన్నై వెళ్ళినపుడు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడని జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఇప్పుడు ఇదే కేసులో బెయిల్‌పై జానీ మాస్టర్ బయటకు వచ్చాడు. ఇక ఈ కేసులో కీలక అధరాలు లభించడంతో జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ చేయమని కోరేందుకు కోర్టుకు వెళ్లే ఆలోచనలలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News