Thursday, December 26, 2024

అకాల వర్షానికి అన్నదాతలు ఆగం

- Advertisement -
- Advertisement -

మండలంలోని ఏజెన్సీలో బుధవారం కురిసిన అకాల వర్షానికి దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వందలెకరాల దాన్యం కొనుగోలుకు నోచుకోక తడిసి ముద్దాయ్యాయి. ఏటూరునాగారం, చిన్నబోయినపల్ల, ఆకులవారిఘణపురం, ఎక్కెల, శంకరాజుపల్లి, రామన్నగూడెం,రాంనగర్‌లో దాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసు కువచ్చి 15రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడంతో కురిసిన అకాల వర్షానికి దాన్యం బస్తాలు తడవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పంటను పండించడంలో ఓ కష్టమైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చాక దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం కావడంతో వాటిని కాపాడుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏజెన్సీ ప్రాంత రైతులు వేడుకొంటున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News