Thursday, December 26, 2024

గురువారం రాశి ఫలాలు(26-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. న్యాయపరమైన అంశాలను అనుకూలంగా మలుచుకోవడానికి గాను నిష్ణాతుల తోటి సంప్రదింపులు సాగిస్తారు.

వృషభం – ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దూరదృష్టితో వ్యవహరిస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. లౌక్యంగా వ్యవహరిస్తారు.

మిథునం –  పాత రుణాల నుండి విముక్తిని సాధించడానికి కొత్త రుణాలు చేయకుండా క్రమబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకుంటారు.

కర్కాటకం – కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం చెప్పదగినది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహం – కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. చట్టబద్ధతలేని కొన్ని స్కీం ల వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి.

కన్య – మీరు అతి ముఖ్యమని భావించే వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగిన చివరకు మీరు అనుకున్నదే అవుతుంది. కాకతాళియ పరిచయాలు లాభసాటిగా పరిణమిస్తాయి.

తుల – నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. రహస్య చర్చలు, రహస్య ప్రయాణాలు తప్పకపోవచ్చు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం – కొన్ని కఠినమైన నిర్ణయాలను అమలు చేయడంలో మాత్రం జాప్యం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు – ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

మకరం – గుడ్ విల్ ను రుజువు చేసుకోగలుగుతారు. విందు, వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి గాను అనువైన మార్గాలు లభిస్తాయి. సాహిత్య రంగాల పట్ల అభివృద్ధిని కనబరుస్తారు.

కుంభం – ఉమ్మడి కొనుగోళ్లు లాబించవు. రుణాలు చేయనంతవరకు ఆర్థికంగా ఇబ్బందులు ఏవి ఏర్పడవు. భూమి సంబంధమైన వ్యవహారాలు కట్టడాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి.

మీనం – వృత్తి- ఉద్యోగాలపరంగా అభివృద్ధి గోచరిస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలను వ్యూహాత్మకంగా అమలు చేస్తారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News