Friday, December 27, 2024

రేసు..కేసు మరింత వేగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ రే స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎసిబి అధికారులు ఫిర్యాదుదారుడు అ యిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కి షోర్‌ను ఏడు గంటల పాటు ప్రశ్నించి, ఆయన నుండి స్టేట్మెంట్‌ను నమోదు చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కెటిఆర్, అ ర్వింద్ కుమార్‌లకు ఎసిబి అధికారులు నోటీసు లు ఇవ్వనున్నారు. దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెం ట్ ఆధారంగా వీరిద్దరిని ఎసిబి అధికారులు ప్ర శ్నిం చే అవకాశం ఉంది. అలాగే ఆయన నుండి తీసుకున్న డాక్యుమెంట్లను కూడా వాళ్ళ ముందు ఉం చి విచారించే అవకాశం ఉంది.

ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే  దాన కిషోర్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఏ నుండి డబ్బు బదిలీ అయినట్టుగా ఆయన ప్రభుత్వానికి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఎసిబి అధికారులు దూకుడును పెంచుతున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News