Friday, December 27, 2024

కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టాలి

- Advertisement -
- Advertisement -

వాజ్‌పేయి శతజయంతి
వేడుకల్లో కార్యకర్తలకు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
పిలుపు అంబేద్కర్‌ను
ఎందుకు విస్మరించారో
కాంగ్రెస్ నాయకులు
ఇప్పటికైనా చెప్పాలని
డిమాండ్

మన తెలంగాణ /హైదరాబాద్ : ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మంత్రి కిష న్ రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ బ తికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శత జయంతి వేడుకలు ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా కేం ద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని తెలిపారు. మంత్రిగా ఉన్న అంబేద్కర్‌తో నె హ్రూ రాజీనామా చేయించారని పే ర్కొన్నారు. 1954 నుంచి 88 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ సహా 21 మందికి కాంగ్రెస్ భారతరత్న ఇ చ్చిందని,

కానీ అంబేద్కర్‌ను ఎందు కు విసర్మించిందో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశా రు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ ఫొటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. అ బద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయీ అని, భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చె ప్పారని అన్నారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం వాజ్‌పేయీ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News