Friday, December 27, 2024

అర్థశతకాలతో చెలరేగిన ఆసీస్‌ టాప్ బ్యాటర్లు..

- Advertisement -
- Advertisement -

బాక్సింగ్ డే టెస్టులో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు కాన్‌స్టాస్(60), ఖవాజా(57)లు శుభారంభం అందించారు. మార్నస్ లబుషేన్(72), స్టీవ్ స్మిత్(68) ఆఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇలా నలుగురు టాప్ బ్యాటర్లు రాణించడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ తోపాటు అలెక్స్ కేరీ (24) ఉన్నాడు. కాగా, ఆసీస్‌ 81 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నస్టానికి 293 పరుగులు చేసింది. ఇక, భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. జడేజా, సుందర్ లు చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News