- Advertisement -
కళ,సంస్కృతి,క్రీడలు తదితర వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ చూపించిన 17 మంది బాలలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలని గురువారం ప్రదానం చేశారు. యవత ప్రతిభను పోషించడం, ప్రోత్సహించడం ప్రాముఖ్యతను వివరించారు. బాలల ప్రతిభను గుర్తించి, తగిన అవకాశాలు కల్పించడం మన సంప్రదాయంలో ఒక భాగమని సూచించారు. ప్రతి బాలుడు లేదా బాలిక తమ శక్తిని, ప్రతిభను తెలుసుకునేలా ఈ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు. విజేతలు ఏడు కేటగిరీల్లో అవార్డులు పొందారు. విజేతల్లో ఏడుగురు బాలురు కాగా, పదిమంది బాలికలు ఉన్నారు. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి మెడల్, సర్టిఫికెట్ ,సైటేషన్ బుక్‌లెట్ ప్రదానం చేయడమైంది.
- Advertisement -