ఐటి, ఫార్మారంగాలతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ప్రధానమైనదే తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్నదే
ప్రభుత్వ లక్షం పరిశ్రమ పురోభివృద్ధికి సినీమా రంగం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయాలి హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను
ఆకట్టుకుందాం రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను సినీ ప్రముఖులు ప్రమోట్ చేయాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన
ఐటీ, ఫార్మా రంగాలు ప్రభుత్వానికి ఎం త ముఖ్యమో సినిమా ఇండస్ట్రీ కూడా తమకు అంతే ముఖ్యమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖులతో ఆయన భేటీ అయ్యా రు. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సిఎం రే వంత్ మాట్లాడుతూ నంది అవార్డుల తరహాలోనే త్వరలో గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు బాధ్యతలు అప్పగించామని ఆయన పే ర్కొన్నారు. ఈ సమావేశంలో భాగంగా పార్టిసిపేట్, ప్రమోట్ ఇన్వెస్ట్ నినాదాన్ని సిఎం వినిపించారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ రైలు పట్టాల్లాంటివని, ఇప్పటివరకు మాట్లాడుకోని అంశాలపై ఉన్న అభిప్రాయాలను మార్చుకునేందుకు ఈ స మావేశం ఉపయోగపడిందని సిఎం అ న్నారు. తన హయాంలో సినీ ఇండస్ట్రీకి
ఇప్పటివరకు 8 జీఓలు ఇచ్చామని సిఎం రేవంత్ గుర్తు చేశారు. అదేవిధంగా స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా అందించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. పరిశ్రమ పురోభివృద్ధికి, ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.
సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకొని హైదరాబాద్‌కు రెండు గంటల్లో రావొచ్చని సిఎం తెలిపారు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని సిఎం పిలుపునిచ్చారు. పరిశ్రమను హలీవుడ్ లెవల్‌కు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని, సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్‌నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని సిఎం హామీనిచ్చారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని ఆయన అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, జితేందర్, సినీ రంగానికి నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన సురేష్ బాబు, కెఎల్ నారాయణ, మురళీమోహన్, కె.రాఘవేందర్ రావు, కొరటాల శివ, వెంకటేశ్, నాగార్జున, అల్లు అరవింద్, త్రివిక్రమ్‌తో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి: నటుడు నాగార్జున
యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని హీరో నాగార్జున తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని,హైదరాబాద్ వరల్డ్ సినిమా కెపిటల్ కావాలన్నదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు.
తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి: దర్శకుడు రాఘవేంద్ర రావు
తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని దర్శకుడు రాఘవేంద్ర రావు తెలిపారు. గతంలో సిఎం చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో నిర్వహించారని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆయన సూచించారు. అందరూ ముఖ్య మంత్రులు తెలుగు సినిమా పరిశ్రమను బాగానే చూసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందని, దిల్ రాజును ఎఫ్‌డిసి చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.
ఎన్నికల ఫలితాలు ఎలాగో.. సినిమా విడుదల రోజు కూడా అంతే: నటుడు మురళీమోహన్
ఎన్నికల ఫలితాలు ఎలాగో సినిమా విడుదల రోజు కూడా అలాగే ఉంటుందని నటుడు మురళీమోహన్ పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన మమ్మల్ని తీవ్రంగా బాధించిందని, సినిమా విడుదల సందర్భంగా జరిగే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల అవుతుండటంతో ప్రమోషన్‌ను పెద్ద ఎత్తున చేయడం అవసరంగా మారిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది: నిర్మాత సురేష్ బాబు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలన్నదే మా కల అని నిర్మాత సురేష్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆనాడు ప్రభుత్వం చేసిన సాయంతోనే చెన్నై నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారాలన్నారు.
ప్రభుత్వానికి, పరిశ్రమకు గ్యాప్‌లేదు : దిల్ రాజు
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడిందని టాక్ వచ్చిందని, కానీ, అలా లేదని తెలం గాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు చెప్పారు. డిజిపితో కూడా తాను మాట్లాడామని, వారు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయ న తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి తమకు సహకరిస్తామని సిఎం స్పష్టం చేశా రని ఎఫ్‌డిసి చైర్మన్ దిల్‌రాజు మీడియాకు వెల్లడించారు. సిఎంతో సానుకూ ల వాతావరణంలో ఈ సమావేశం జరిగిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమను పాన్ వరల్డ్ లెవల్‌కు తీసుకెళ్లాలని సిఎం సూచించినట్లు దిల్ రాజు తెలిపా రు. హైదరాబాద్ సిటీలో హాలీవుడ్ సినిమాల షూటింగ్‌లు జరిగేలా చూడా లని సిఎం సూచించారన్నారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సిఎం కోరినట్లు ఆయన చెప్పారు. దీనికి హీరోలు, హీరోయిన్స్ సహకరిస్తారని సిఎంకు సినీ ఇండస్ట్రీ తరపున హామీ ఇచ్చామని దిల్ రాజు వెల్లడించారు. సిఎం విజన్ తమకు చెప్పారని, ఇండియా లెవల్లో తెలుగు సినిమాకు గౌరవం దక్కుతుందని దిల్ రాజు గుర్తుచేశారు.