- Advertisement -
ఢిల్లీ: ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దేశం గుర్తిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మోడీ మీడియాతో మాట్లాడారు. ఆర్‌బిఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో సేవలందించారని కొనియాడారు. పివి హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని, దేశం, ప్రజలపట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగినదని మోడీ ప్రశంసించారు. విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలు అందించారని, ఎన్నోకీలక పదవులు అధిష్టించినా సాధారణ జీవితం గడిపారన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడానని, తన తరపున, దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మోడీ స్పష్టం చేశారు.
- Advertisement -