- Advertisement -
మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ముగిసే సమయానికి టీమిండియా 46 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆసీస్ జట్టు 310 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. భారత బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్(82), విరాట్ కోహ్లీ(36), కెఎల్ రాహుల్(24), రోహిత్ శర్మ(03), ఆకాశ్ దీప్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(06), రవీందర్ జడేజా(04) పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474
- Advertisement -