ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హోండా సరికొత్త అప్‌డేట్‌లతో హోండా యునికార్న్‌ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్‌లో కొత్త ఫీచర్లను అందించారు. దీనితో పాటు.. అనేక అప్డేట్ లు కూడా పొందుపరిచారు. దీంతో ఈ బైక్ మునుపటి కంటే మరింత సరసమైనదిగా కనిపిస్తోంది. ఈ క్రమంలో 2025 హోండా యునికార్న్ లో ఎలాంటి కొత్త ప్రత్యేక ఫీచర్లతో విడుదల చేయబడిందో ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
హోండా యునికార్న్ కొత్త ఎల్ఈడి హెడ్‌లైట్‌తో వస్తుంది. ఇది ఇంతకు ముందు ఉన్న హాలోజన్ హెడ్‌లైట్‌ను భర్తీ చేస్తుంది. దీంతో ఇది దాని కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 162.71cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇందులో అమర్చిన ఇంజన్ 13.18PS పవర్, 14.58Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
కొత్త ఫీచర్లు
కొత్త హోండా యునికార్న్‌లోని కొత్త కన్సోల్‌లో వేగం, ఇంధన స్థాయి, సమయం, ట్రిప్‌మీటర్, ఓడోమీటర్ రీడౌట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, ఇది సర్వీస్ డ్యూ అలర్ట్, ఎకో ఇండికేటర్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇందులో అందించబడిన ఎకో ఇండికేటర్ బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు. ఇది మైలేజీని పెంచడంలో సహాయపడే విధంగా రైడర్‌లు బైక్‌ను నడపడానికి అనుమతిస్తుంది. ఈ బైక్‌లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు. దీంతో బైక్ ని నడిపే సమయంలో రైడర్లు తమ ఫోన్‌లను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ధర
హోండా యునికార్న్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1,19,481గా పేర్కొంది. కేవలం పైన పేర్కొన్న అప్‌డేట్‌లు మాత్రమే ఉన్నాయి. బైక్, మునుపటిలాగే సరసమైన 160సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్. ఇక ఈ బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. అయితే, ఇటీవల హోండా ఇండియా తన ప్రీమియం కమ్యూటర్ బైక్‌లు హోండా ఎస్ పి 160, యాక్టీవా125లను అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే.