మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభిమైన అంతియాత్ర… నిగమ్‌బోధ్ ఘాట్‌కు మన్మోహన్సింగ్ కు కొనసాగనుంది. ఈ అంతిమయాత్రలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా అంతిమయాత్ర వాహనంలో ఉన్నారు.
అంతకుముందు, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ పార్థివదేహానికి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా, మల్లికార్జున ఖర్గే తదితరులు నివాళులర్పించారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించి.. ఆయన సతీమణి గురుశరణ్ కౌర్, కుమార్తె దామన్ సింగ్ కూడా నివాళర్పించారు. మన్మోహన్ మృతి పట్ల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. బైడెన్, ఆయన సతీమణి జిల్.. మన్మోహన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.